నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికీ నమస్కారం.

మన కాలేజ్ మెమరీ ఫైల్స్ మళ్లీ ఓపెన్ చేయాల్సిన టైమ్ 💻😄

డిప్లొమా 1వ సంవత్సరం “కొత్త స్టూడెంట్ భయం” 😅 నుంచి ఫైనల్ ఇయర్ “ఫుల్ కాన్ఫిడెన్స్ మోడ్” 😎 వరకు…..

కోడింగ్ స్ట్రగుల్స్, ల్యాబ్ మారథాన్లు, లాస్ట్-మినిట్ రికార్డులు, ఫ్రెండ్లీ ప్రాంకులు, క్లాసులు బంక్ చేయడం, ప్రాజెక్ట్ టెన్షన్, వైవా డ్రామా మరియు స్నేహితులతో ఎండ్లెస్ నవ్వులతో నిండిపోయింది 😄

ఆ స్టూడెంట్ యాక్టివిటీస్ ఈవెంట్స్ మాత్రమే కాదు - 
క్లాస్‌మేట్స్‌ని ఒక కుటుంబంగా మార్చిన అమూల్య క్షణాలు అవి ❤️

❤️ మన కాలేజ్ రోజులు – మనసు మాటలు ❤️

మొదటి రోజు కాలేజీ గేటు దగ్గర,
అమ్మ నాన్నల చేతిని పట్టుకొని నిలిచిన క్షణం,
భయంతో నిండిన మనసుకు, ఆ గడపే మొదటి ధైర్యం అయింది.

తెలియని ముఖాలు, కొత్త క్లాస్‌రూమ్‌లు, 

మనల్ని మనమే వెతుక్కున్న రోజులు, 

ఒక్కొక్కరిగా పరిచయమై,  

చివరికి కుటుంబంగా మారిన స్నేహాలు.


ఒక్క నవ్వుతో మొదలైన పరిచయాలు,
ఒక్కో ఏడుపుతో బలమైన స్నేహాలయ్యాయి,
పేర్లతో కాదు…………..,
భావాలతో పిలుచుకున్న బంధాలవి.

నవ్వుల వెనుక దాచుకున్న కన్నీళ్లు, 

ఫెయిల్యూర్స్‌లో పంచుకున్న ఆశలు, 

ల్యాబ్‌ల్లో కలలు కట్టుకున్నాం, 

కాలేజీ గోడలకే మన కథ చెప్పుకున్నాం.


రోజులు నెమ్మదిగా జారిపోయాయి,
చివరి రోజు చాలా వేగంగా వచ్చేసింది,
బోర్డు ముందు నిలబడి నవ్విన మన ముఖాల వెనుక,

చెప్పలేని ఏడుపు దాగి ఉంది.


కాలం వేగంగా పరుగెత్తింది… 

సర్టిఫికెట్లు చేతికి వచ్చాయి, 

కానీ, ఆ …. చివరి రోజు….., 

కన్నీళ్లతో గుండె భారమైంది.


సర్టిఫికెట్లు చేతిలో పట్టుకుని,
కాలేజీకి వెనుదిరిగినప్పుడు,
మన జీవితంలో మొదటిసారి…….,
ఇంటికి వెళ్లడం కూడా … భారంగా అనిపించింది.

ఈ రోజు మనం ఎక్కడ ఉన్నా, 

MNC అయినా, బిజినెస్ అయినా, B.Tech అయినా, 

మన గుండె లోపల మాత్రం……………, 

ఇంకా అదే విద్యార్థి బతికే ఉన్నాడు.


కాలేజీ అయిపోయింది అంటారు…
కానీ మన లోపల మాత్రం,
ఇంకా అదే విద్యార్థి,
అదే బెంచ్, అదే స్నేహం బతికే ఉంది.

ఇది మన విద్యాసంస్థ మాత్రమే కాదు, 

**మన కన్నీళ్లకు అర్థం నేర్పిన చోటు.

 

మన జీవితానికి పునాది కాదు… *మన భావాల చిరునామా.* 💙


ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో

విజయం, ఆనందం, మంచి ఆరోగ్యం

మరియు ఇంకా ఎన్నో నవ్వులు తీసుకురావాలని కోరుకుంటున్నాం




మీ….మన 

ప్రొద్దటూరు ప్రభుత్వ పాలీటెక్నిక్

 

          Courtesy:

RAJENDRA DILEEP KUMAR (Batch-23).

Comments